Header Banner

జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన పరిణామాలు.. సుమారు నాలుగు గంటలపాటు - అసలేం జరిగింది అంటే.!

  Wed Apr 16, 2025 17:22        Politics

మాజీ సీఎం జగన్ ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు చోటుచేసుకున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పైలట్, కోపైలట్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా కోపైలట్ శ్రేయస్ జైన్ బుధవారం విచారణకు హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కార్యాలయంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, సీకేపల్లి సీఐ శ్రీధర్ కలిసి సుమారు నాలుగు గంటలపాటు శ్రేయస్ జైన్ ను ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక కోపైలట్ బెంగళూరు తిరిగి వెళ్ళిపోయారు.

 

ఇది కూడా చదవండి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

 

తాము అడిగిన అన్ని ప్రశ్నలకు కోపైలట్ సమాధానం ఇచ్చారని సీఐ శ్రీధర్ తెలిపారు. సెలవులో ఉన్నందున పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరుకాలేదని.. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సీఐ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైకాపా కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఇటీవల గ్రామానికి వచ్చారు. వైకాపా ఆధ్వర్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ దిగిన వెంటనే వైకాపా శ్రేణులు బారికేడ్లను తోసుకొని జగనన్ను చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, ప్రభుత్వం, పోలీసుల భద్రతా వైఫల్యంతోనే జరిగిందని వైకాపా నాయకులు ఆరోపించారు. తమ అధినేత హెలీకాప్టర్లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డుమార్గాన వెళ్లారని చెప్పారు. దీంతో హెలిప్యాడ్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్, కోపైలట్, కర్ణాటక రాష్ట్రం జక్కూరులోని నిర్వహణ సంస్థకు నోటీసులు అందజేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #YCPOffice #Notes #APNews #APpolitics